మణిరత్నం సలహాను ఫాలో అవుతున్న మెగా హీరో

Posted February 2, 2017 (3 weeks ago)

mega hero following maniratnamసెలబ్రిటీలకు  కావాల్సింది ఇమేజ్. అందునా హీరోలకైతే ఇమేజ్ మరీ ముఖ్యం. ఒకవేళ వారి సినిమాలు యావరేజ్ అయినా కానీ వారి ఇమేజ్ ఆ సినిమాలను  హిట్ వరకు నడిపిస్తాయి. కాబట్టి హీరోలు తమ ఇమేజ్ ను కాపాడుకుంటుంటారు. అయితే సదరు హీరోలు కొత్త లుక్ లో కనిపిండానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి  ఆ ఇమేజే వారికి అవరోధంగా కూడా మారుతుంటుంది. కానీ కొంతమంది హీరోలు ఆ అవరోధాలు దాటుకుని సక్సెస్ అయ్యారు.

తాజాగా మెగా హీరో రామ్ చరణ్ కూడా ఆ అవరోధాలు తప్పించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పటివరకూ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేసిన చెర్రీ  తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో  పల్లెటూరి యువకుడిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో చెర్రీని చూసిన వాళ్లు… చెర్రీలో బాగా  చేంజ్ వచ్చిందని అంటున్నారు. అయితే తనలో ఆ ఛేంజ్ రావడానికి, సరికొత్త పాత్రలను చేయడానికి కారణం మణిరత్నం అని చెబుతున్నాడు చరణ్. ఒకే విధమైన సినిమాలు చేస్తే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం మానేస్తారని, ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కథలు, పాత్రలను ఎంచుకోవాలని చెర్రీకి  సలహా ఇచ్చారట మణిరత్నం. అలా చేస్తేనే నిజమైన నటుడు బయటికి వస్తాడని అన్నారట. దీంతో అప్పటి నుంచి ఆయన ఇచ్చిన సలహాను పాటిస్తున్నానని చరణ్ చెప్పుకొచ్చాడు.

NO COMMENTS

LEAVE A REPLY