మెగాస్టార్ కు గెస్టులు ఎవరంటే..!

Posted [relativedate]

Megastar audio guest tollywoodమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ఖైది నెంబర్ 150 సినిమా ఆడియోకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబందించిన కార్యచరణలు స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ ఆడియో ఫంక్షన్ కు అతిధిలుగా ఎవరెవరిని పిలవాలో చర్చించుకుంటున్నారు. చిరు సమక్షంలో ఇప్పటికే కొందరిని ఇన్వైట్ చేశారట కూడా. తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగా ఆడియోకి విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునలతో పాటుగా కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వస్తారని టాక్.

ఇప్పటికే వీరితో చిరు మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇక మెగా హీరోలందరు (పవన్ కళ్యాణ్ గురించి తెలియదు) ఈ ఆడియోలో ప్రత్యక్షమవుతారట. మెగా హీరోలతో మంచి రాపో మెయింటైన్ చేస్తున్న కుర్ర హీరోలందరు కూడా ఈ ఆడియోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. సో మెగా ఫంక్షన్ టాలీవుడ్ అంతా ఒక్క చోట కలిసే కార్యక్రమంగా కనిపిస్తుంది.

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ డిసెంబర్ 9న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాకే మెగాస్టార్ మూవీ ఆడియో ఉంటుందట. ధ్రువ సినిమాతో పాటుగా మెగా ఆడియోతో ఫ్యాన్స్ మరింత ఖుషి అయ్యే అవకాశాలున్నాయి.