ప్రత్యేక హోదా పై జగన్ కి మోడీ మాటిచ్చాడా?

Posted May 20, 2017 (2 weeks ago) at 11:27

mekapati rajamohan reddy says about ap special status
ప్రధాని మోడీ తో భేటీ తర్వాత వైసీపీ అధినేత జగన్ మాట తీరు ఒక్కసారిగా మారిపోవడం అందరం చూస్తూనే వున్నాం. బీజేపీ భజన ఏ రేంజ్ లో చేసినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వైఖరితో విభేదిస్తున్నట్టు జగన్ స్వయంగా చెప్పారు.అయితే హోదా కోసం పార్టీ ఎంపీ ల రాజీనామా అంశాన్ని మాత్రం పక్కన పెట్టారు.ఇదే విషయంలో ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తమ ఎంపీ లు ఎందుకు రాజీనామా చేయడంలేదో వివరించారు. మోడీతో జగన్ భేటీ తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం కలిగిందట. అందుకే తాము రాజీనామాలు చేయాలి అనుకోవడం లేదని ఎంపీ గారు చెప్పడంతో వైసీపీ శ్రేణులే నోటి మీద వేలేసుకుంటున్నాయి.

మోడీ,జగన్ భేటీలో ఏమి జరిగిందన్న దాని మీద ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే సాక్షాత్తు జగన్ కూడా చెప్పని ఓ విషయాన్ని మేకపాటి ఇంత ధైర్యంగా చెప్పేయడం చూస్తుంటే రాజకీయ నాయకులు జనాన్ని ఎంత తేలిగ్గా అంచనా వేస్తున్నారో అర్ధం అయిపోతుంది. ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే కేంద్రంతో విభేదాలు ఉన్నాయని జగన్ చెప్పిన మాటలు నిజమా ? లేక జగన్ చెవిలో హోదా ఇస్తామని మోడీ చెప్పిన మాట నిజమా ? అబద్ధం చెప్పింది జగనా…మేకపాటి రాజమోహన్ రెడ్డా? ఇలాంటి వ్యవహారాలు రాజకీయ వ్యవస్థపై అసలుకే అంతంత మాత్రంగా వున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొడతాయి.

Post Your Coment
Loading...