లోకేష్ కి మంత్రి పదవి వరమా…శాపమా?

Posted [relativedate]

ministery to lokesh is all set up
అటుఇటు కాని హృదయం నీది అంటూ లోకేష్ తన మీద తానే పాడుకుంటున్నాడేమో! పక్షం రోజుల్లో ఒకే టాపిక్ మీద రెండుమూడు రకాలుగా మాట్లాడ్డం లోకేష్ అయోమయాన్ని సూచిస్తోంది. తెరచాటు పెత్తనమెందుకు..ముందుకు రమ్మని టీడీపీ శ్రేణులే పిలుస్తున్నా వారిని ఉద్దేశించి మంత్రి పదవి తీసుకునే ఉద్దేశం లేదని గుంటూరు లో లోకేష్ ప్రకటన ఆసక్తి రేపింది. నిజంగా పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యే ఉద్దేశం ఉందేమో అనుకున్నారంతా..ఓ వారం గడిచిందో లేదో ..ఒకవేళ మంత్రి పదవి తీసుకోకపోతే అసమర్ధుడు అనుకుంటారేమో అని పార్టీ నేతలని ఉద్దేశించి లోకేష్ నుంచి మరో డైలాగ్.రెండు సార్లు పార్టీ సమావేశాల్లోనే లోకేష్ భిన్నమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఓ విఫల వ్యూహం ఉందనిపిస్తోంది.
లోకేష్ మంత్రి పదవి వద్దనగానే పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తాయని అయన అనుకున్నారేమో.ఆ పరిస్థితి కనపడకపోయేసరికి మళ్లీ ప్లాన్ మార్చుకుని మరో డైలాగ్ చెప్పి ఉండొచ్చు. లేదా బాధ్యతల భారం మోయగలనా లేదా అన్న సందేహం లోలోన ఎక్కడో లోకేష్ ని ఇబ్బందిపెడుతుందేమో…ఏదేమైనా రాజకీయ వారసత్వం ఎంతటి వరమో …అంతటి శాపం కూడా! పదవి రావడం తేలికేమో గానీ దాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిగ్గాదు..అందులోనూ పార్టీ అధికారంలో వున్నప్పుడు అంతా సవ్యంగానే కనిపిస్తుంది.ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినపుడే అసలు శక్తిసామర్ధ్యాలు బయటపడేది.రాహుల్ గాంధీ నుంచి జగన్ దాకా కళ్ల ముందే ఎన్ని ఉదాహరణలు! ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేష్ విపక్ష నేతగా చేసిన పాదయాత్ర ఆయన్ను సీఎం పీఠానికి దగ్గర చేసింది.అందుకే ఇప్పుడు పార్టీ అంతర్గత సంక్షోభాన్ని కూడా అయన అంత దీటుగా ఎదుర్కోగలుగుతున్నారు.అటు రాహుల్ యూపీఏ అధికారంలో వున్నప్పుడు బాధ్యతల స్వీకారానికి వెనకడుగు వేసి పెత్తనం చెలాయింపుకే పరిమితమయ్యారు.దాని ఫలితమే ఇప్పుడు అధికారం లేదు …వచ్చినా దాన్ని నిర్వర్తించే అనుభవం లేదు. ఇక జగన్ తండ్రి వున్నప్పుడు ,అయన పోయాక కూడా అధికారం కోసం తహతహలాడారు.దాంతో ప్రజలే ఆయన్ని కుర్చీకి దూరంగా కూర్చోబెట్టారు.ఈ ముగ్గురిదీ మూడు దారులు..ముగ్గురి అనుభవాల నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంది.అయితే అన్ని జీవితాలు,అనుభవాలు,ఫలితాలు ఒకేలా వుండవు.ఆ విచక్షణ ఉంటే నాయకుడు గా రాణించవచ్చు ..అది లేకుంటే అధికారమనే వరమే శాపమవుతుంది …లోకేష్ తస్మాత్ జాగ్రత్త .