ముంబయి రెడ్‌ లైన్‌ ఏరియాకు వెళ్లినా ఆమెకు ప్రతిఫలం దక్కలేదు

 Posted May 8, 2017 (3 weeks ago) at 16:21

misti chakravarti going to mumbai red light area for babu baga busy movie
బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘హంటర్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో పలువురు ముద్దుగుమ్మలు నటించారు. అయితే అందరి కంటే కాస్త ఎక్కువ ప్రాముఖ్యత మిస్తి చక్రవర్తికి ఉందని చెప్పాలి. ఈ అమ్మడు సినిమాలో చాలా కీకమైన పాత్ర పోషించి ఆకట్టుకుంది. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా మిస్తి నటనకు మరియు ఎక్స్‌ప్రెషన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ అమ్మడు ఆ స్థాయి నటనను కనబర్చేందుకు చాలా కష్టపడ్డట్లుగా ఆమె సన్నిహితులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ పాత్ర కోసం రియల్‌గా బ్రోతల్‌ హౌస్‌కు మిస్తి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

‘బాబు బాగా బిజీ’ చిత్రంలో ఒక వేశ్య పాత్రలో నటించిన మిస్తి చక్రవర్తి అచ్చు వేశ్యలా నటించి మెప్పించింది. ఆమె బాడీ లాంగ్వేజ్‌ మరియు మాట తీరు,  మాట్లాడేప్పుడు శరీరాన్ని కదిలించే విధానం అన్ని కూడా ఆమెను పక్కా వేశ్య అంటే నమ్మేట్లుగా ఉన్నాయి. ఈ బాడీ లాంగ్వేజ్‌ కోసం మిస్తి ముంబయిలోని రెడ్‌ లైట్‌ ఏరియాకు పలు సార్లు వెళ్లిందట, అక్కడ కొత్త అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారు, పాత అమ్మాయిలు ఎలా ఉంటారు, కస్టమర్లతో అమ్మాయిలు ఎలా డీల్‌ చేస్తారు అనే విషయాలను చూసి తెలుసుకుందట. ఇంత కష్టపడ్డ మిస్తికి సినిమా సక్సెస్‌ అయితే మరింత గుర్తింపు వచ్చేదేమో.

Post Your Coment
Loading...