వాటర్‌ ఫ్రూఫ్‌ మొబైల్‌ పౌచ్‌లు…

Posted November 15, 2016 (4 weeks ago)
mobile waterproof pouchనిత్యజీవితంలో రోజులో చాలా సార్లు నీటిని అవసరం కోసం ఉపయోగిస్తూనే ఉంటాం.. ఈ క్రమంలో మన కవచ కుండలాల్లా ఉండే మొబైల్‌ ఫోన్లు పొరపాటున నీటి బారిన పడితే ఏదో ఒక ఇబ్బంది తలత్తక మానదు.. దాని కోసం వాటి బాధల నుంచి బయటపడేందుకు ఈ వాటర్‌ ఫ్రూఫ్‌ పౌచ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పౌచ్‌లు లాక్‌ సిస్టమ్‌తో పనిచేస్తాయి. మొబైల్‌ దాంట్లో పెట్టి లాక్‌ చేస్తే చాలు చుక్క నీరు కూడా లోపలికి చేరదు. వాటర్‌ ఫ్రూఫ్‌ పౌచ్‌ అంటే వర్షానికి మాత్రమే అనుకుంటే పొరపాటే.. దాన్ని తొడిగి నీటి అడుగు భాగంలోకి కూడా తీసుకెళ్చొచ్చు. తీసుకెళ్లడంతోపాటు అక్కడ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే కెమెరా ఉండే వైపు, ఎదరఉండే డిస్‌ప్లే వైపు కనిపించేలా ఏర్పాటు ఉంటుంది కాబట్టి వీడియో లాంటివి కూడా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌ మార్కెట్టులో రూ.150 నుంచి రూ.2వేల వరకు ఈ తరహా పౌచ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రత్యేక మోడళ్లకు విడిగా వాటర్‌ ఫ్రూఫ్‌ కేసులు కూడా ఉన్నాయి.
 

NO COMMENTS

LEAVE A REPLY