పరుచూరి బ్రదర్స్ ని మించిపోయిన మోడీ..

Posted February 4, 2017 (4 weeks ago)

modi dialogue better than paruchuri brothers dialogue in uttar pradesh elections meeting
ప్రధాని మోడీకి ,పరుచూరి బ్రదర్స్ కీ పోలిక ఏంటా అనుకుంటున్నారా ?అక్కడికే వస్తున్నాం .అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల కిందట ఓ సినిమాలో పరుచూరి బ్రదర్స్ రాజకీయం గురించి ఓ డైలాగ్ రాశారు.రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు.రా అంటే రాక్షసంగా,జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ,య అంటే యంత్రాంగం అని అర్ధం చెప్పి సంచలనం సృష్టించారు.అలాంటి డైలాగ్స్ ఇప్పటికీ జనాల్లో బాగా పాపులర్.ఎందుకంటే అందులో కంటెంట్ నిజమని జనం నమ్మడం ఓ కారణం అయితే ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం ఇంకో కారణం.ఇలాంటి పాపులర్ నిర్వచనాలు ఏ రచయితలో,జర్నలిస్టులో ఇవ్వడం సహజం.కానీ పరుచూరి బ్రదర్స్ ని మించిపోయేలా మోడీ ఓ నిర్వచనం ఇచ్చారు.ఇప్పడు యూపీ ఎన్నికల ప్రచారంలో అదే హాట్ టాపిక్. ఇంతకీ మోడీ ఏమి చెప్పారో చూద్దామా ?

స్కాం అంటే కుంభకోణం.ఇంగ్లీష్ లో ని స్కాం అనే మాటకి మోడీ అదిరిపోయే నిర్వచనం ఇచ్చారు.ఎస్ అంటే సమాజ్ వాదీ,సి అంటే కాంగ్రెస్ ,ఏ అంటే అఖిలేష్,ఎం అంటే మాయావతి…ఈ నలుగురు కలిస్తే స్కాం అంటే కుంభకోణం అని మోడీ ఎన్నికల ప్రచార సభల్లో చెబుతున్న మాటలకి యూపీ జనాలు పెద్ద ఎత్తున నవ్వుకుంటున్నారు.ఆయన చెప్పినదాంట్లో నిజానిజాలు పక్కనపెడితే ఒక్క స్కాం అన్న మాటతో ప్రత్యర్థులందర్నీ అవినీతిపరులుగా ముద్రవేసిన మోడీ చాకచక్యం తలపండిన రచయితలకి ఏ మాత్రం తక్కువ కాదు.అందుకే పరుచూరి బ్రదర్స్ ని మోడీ మించిపోయారని చెప్పే ధైర్యం చేశాం.

NO COMMENTS

LEAVE A REPLY