కాంగ్రెస్ నెత్తిన మోడీ పాలు పోస్తున్నాడా?

Posted May 16, 2017 (2 weeks ago) at 18:02

modi doing it rides on congress leader chidambaram and lalu prasad yadav
రాజకీయాల్లో హత్యలుండవు..ఆత్మహత్యలు తప్ప అన్నది అందరికీ తెలిసిందే.దేశంలో మోడీ ప్రభంజనం మొదలయ్యాక కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.ఒక్కసారి కూడా కాంగ్రెస్ తిరిగి కోలుకోగలదన్న నమ్మకం ఏర్పడలేదు.రాహుల్ ఎత్తుగడలు,వ్యూహాలు చూసాక కాంగ్రెస్ మీద నమ్మకం అటుంచి కనీసం ఆశ కూడా లేకుండా పోయింది.కాంగ్రెస్ వైభవం,అస్తిత్వం చరిత్ర పుటల్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది .అది చూసి ఎంజాయ్ చేయాల్సిన మోడీ కూడా లేనిపోని విషయాలతో కాంగ్రెస్ నెత్తిన పాలు పోసే వాతావరణం కల్పిస్తున్నారు. అదెలాగో తెలుసా?

ఈడీ,సిబిఐ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాంగ్రెస్ వాడినదానికి పది రెట్లు వాడేశారు కమలనాధులు .దేశంలో బీజేపీ తప్ప ఇంకో పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో ఆ పార్టీల నేతలు విధానాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నయం అనే వ్యాఖ్యానాలు విరివిగా చేస్తున్నారు.తాజాగా చిదంబరం, లాలూ మీద దాడులతో ఆ మోడీ భయం ఇంకాస్త పెరిగింది.ఇదే పరిస్థితి కొనసాగితే ….ఆ భయం కొనసాగితే అది కాంగ్రెస్ మీద ప్రేమగా మారే రోజులు వస్తాయి.

Post Your Coment
Loading...