జన్ ధన్ నుంచి 10 వేలే..

0
20

Posted November 30, 2016 (2 weeks ago)

Image result for modi said jan dhan account holders withdraw 10 thousand rupees a month

నల్లధనం ఏ కలుగులో వున్నా బయటికి రప్పించేందుకు కేంద్రం మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది.పేదోళ్ల జన్ ధన్ ఖాతాల్ని వాడుకుని పెద్దోళ్ళు నల్లధనాన్ని వైట్ గా మారుస్తుండటాన్ని మోడీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.ఆ ఖాతాల్లో భారీగా డిపాజిట్ అవుతోంది పెద్దోళ్ల డబ్బేనని అర్ధం అయిన వెంటనే ఈ అక్రమాన్ని ఆపేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయిన డబ్బుకి లెక్క చెప్పాలని ఓ వైపు హెచ్చరిస్తూనే మరోవైపు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.జన్ ధన్ ఖాతాల నుంచి నెలకు కేవలం 10 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేయాలని కొత్తగా పరిమితి విధించింది.దీంతో పెద్దోళ్ళు పెట్టే ప్రలోభాలకు చిన్నోళ్లు లొంగకుండా ఉంటారని ….కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ద్వారా లభించిన వెసులుబాటుని నల్లధనం వున్నవాళ్లు వాడుకుంటారని మోడీ సర్కార్ భావిస్తోంది.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఏ పరిణామాన్ని ఎదుర్కోడానికైనా కేంద్రం ముందంజ వేయడం చూస్తుంటే ఇదంత తేలికైన విషయం కాదని అందరికీ అర్ధం అవుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY