తంబిదురై వైపు మోడీ మొగ్గు!!

Posted February 7, 2017

modi planning to make tambidurai cm
ఓవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఇటుచూస్తే శశికళ పట్టాభిషేకం రద్దయ్యింది. మరో వారం రోజుల్లో తీర్పు రానుంది. ఈ పరిస్థితుల్లో మోడీ ఏం ఆలోచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

కేంద్రపెద్దలు కొందరు వారం రోజులు ఆగడం ఎందుకు? రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఎలా ఉంటుంది? అని మోడీకి చెబుతున్నారట. అయితే మోడీ ఆలోచన దీనికి భిన్నంగా ఉన్నట్టు సమాచారం. సెంటిమెంట్ ఎక్కువగా తమిళనాడులో ఇలా చేస్తే బీజేపీపై వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అందుకే అన్నాడీఎంకే విషయంలో ఆచి తూచి స్పందిచాలన్న నిర్ణయానికి వచ్చారట.

బీజేపీ పెద్దలు మళ్లీ త్యాగధనుడు పన్నీర్ సెల్వంకే అవకాశం ఇవ్వాలని మోడీకి సూచించారట. అయితే సెల్వంను అడ్డు పెట్టుకొని శశికళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మోడీ సీరియస్ గా ఉన్నారట. అందుకే సెల్వంకు అవకాశం ఇవ్వకుండా.. అన్నాడీఎంకే నుంచి మరో నేతను తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతోందని టాక్.

సెల్వంను మినహాయిస్తే ఆ స్థాయి నేతలు అన్నాడీఎంకేలో పెద్దగా లేరు. ఒక్క తంబిదురైకి మాత్రమే అంతో ఇంతో మంచి ఇమేజ్ ఉంది. పార్టీ సీనియర్ నేతగా క్యాడర్ లోనూ మంచి గుర్తింపే ఉంది. ఈయనకు కేంద్రంతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి తంబిదురైకి అవకాశమివ్వాలని మోడీ ఆలోచిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ సీనియర్లతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. మోడీతో అందరూ ఏకీభవించినట్టు సమాచారం. తంబిదురై కూడా తనకు అవకాశం ఇవ్వాలని జోరుగా లాబీయింగ్ కూడా చేస్తున్నట్టు టాక్. వెంకయ్య నాయుడు కూడా ఆయనకే మద్దతు పలుకుతున్నారట. అందుకే ఈసారి త్యాగధనుడు సెల్వం సారుకు మరోసారి సీఎం ఛాన్స్ రాకపోవచ్చని టాక్. ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప తంబిదురై సీఎం అయ్యే అవకాశలే ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY