గాలి ఇంటి పెళ్ళికి మోడీ రేషన్..

Posted November 10, 2016

modi ration togali daughter wedding
వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనుకున్నాడేమో గాలి జనార్దన్ రెడ్డి..అందుకే జైలుకెళ్లొచ్చినా కూతురి పెళ్లి విషయంలో మాత్రం ఏ కొరవ లేకుండా చూస్తున్నాడు.మొత్తం పెళ్లి ఖర్చు మాటెలా వున్నా ఒక్క విందు కోసమే వెయ్యి రకాల వంటకాలు,100 కోట్ల ఖర్చు కి రెడీ అయ్యారంట.అయితే ఈ ఆడంబరానికి ఊహించని బ్రేక్ పడింది.500,1000 నోట్ల నిషేధంతో గాలి అండ్ కో ఒక్కసారిగా షాక్ కి గురైంది.ఉన్న పళంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తం 100 నోట్ల రూపంలోకి తీసుకురావడం ఎలాగో తెలీక అల్లాడుతోంది.

కర్ణాటక ప్రజలంతా పెళ్ళికి రావాలని రాజరికం తరహాలో కుమార్తె పెళ్ళికి బహిరంగ ఆహ్వానం పలికిన గాలికి మోడీ రేషన్ పెట్టినట్టైంది.పైగా ఇప్పటికే గాలి ఇంటి కల్యాణ వైభోగం మీద ఐటీ శాఖ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.పైగా పెళ్ళికి సంబంధించి అన్ని రకాల సేవలు అందించేవాళ్ళకి ఇప్పటికే భారీ అడ్వాన్స్ ఇచ్చి వున్నారు.మిగిలిన సొమ్ము వారికి వందల రూపంలో ఇవ్వడం ఇప్పుడు గాలి ముందున్న అతి పెద్ద సవాల్.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY