వారికి భయపడను….. మోడీ

Posted November 14, 2016 (4 weeks ago)

modi said no fear on corruption people at ghazipur in uttar pradeshఅవినీతిని అంతం చేయడానికే మీరు నాకు అధికారం ఇచ్చారు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో ఈ రోజొక బహిరంగ సభలో మాట్లాడిన ఆయన నల్లకుబేరులకు, బ్లాక్ మనీకి వ్యతిరేకంగా తాను తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీ పరులను ఇబ్బంది పెట్టనని చెప్పిన ఆయన అదే సమయంలో అవినీతి పరులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పాలన నుంచి నల్ల ధనం వరకూ పలు అంశాలపై ఆయన ప్రసంగించారు.  పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడటం తననెంతో బాధించిందని చెప్పిన ప్రధాని కానీ నల్లధనంపై ఉక్కుపాదం మోపడానికి అనివార్య పరిస్థితులలోనే గట్టి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని వివరించారు. ఈ విషయంలో తనను వ్యతిరేకించేవారు చాలా బలవంతులని, అయితే తాను వారికి భయపడననీ, సత్యం, సమగ్రత అన్న తన దారిని విడనాడనని మోడీ అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY