సబ్ కమిటీతో మోడీ దువ్వుతున్నారా?

Posted November 29, 2016

Image result for modi about sub committee
నోట్ల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో… తగిన సలహాలు, సూచనల కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (జేడీయూ).. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ).. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి (కాంగ్రెస్).. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు (కమ్యూనిస్ట్ పార్టీ) కు చోటు దక్కింది. ఈ కమిటీకి సారథ్యం వహించే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. ఇంత వరకు బాగానే ఉన్న అసలు సబ్ కమిటీని ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సబ్ కమిటీ రూపకల్పనలో మోడీ అత్యంత జాగ్రత్త వహించారని తెలిసిపోతుంది. నలుగురు ముఖ్యమంత్రులు.. అది కూడా వేర్వేరు పార్టీల వారు. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. దీని వెనక పెద్ద స్కెచ్చే ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీకి పలు పార్టీల మద్దతు అవసరం. అందులోనూ నితీశ్ కుమార్, చంద్రబాబు లాంటి బలమైన ముఖ్యమంత్రుల అవసరం ఎక్కువ. అందుకే వారిని దువ్వేపనిలో పడ్డారు మోడీ. వారి నుంచే సలహాలు, సూచనలు స్వీకరించి… ఆయా రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన ప్రధాని గారిదట.

ప్రధాని మోడీ ఈ సబ్ కమిటీ వ్యూహం వెనక నెగిటివ్ ప్లాన్ కూడా ఉండొచ్చని అనుమానాలున్నాయి. ఆయా ముఖ్యమంత్రులకు సబ్ కమిటీలో చోటు కల్పించి.. నోట్ల కష్టాల విషయంలో సీఎంలనూ బ్యాడ్ చేసేందుకు ఈ ప్లాన్ జరిగిందని సమాచారం. అయితే నితీశ్ కుమార్, చంద్రబాబు లాంటి సీఎంలు.. అంత ఈజీగా మోడీ ట్రాప్ లో పడరు. సో ఎవరి వాదన ఎలా ఉన్నా… ఈ సబ్ కమిటీ వెనక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది.

Post Your Coment
Loading...