వైసీపీ లోకి మోహన్ బాబు?

0
217

Posted November 27, 2016 (6 days ago)

అతి త్వరలో రాజకీయ ప్రకటన అంటూ ఊరిస్తున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు అడుగులు వైసీపీ వైపు పడుతున్నాయా?అయన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారా? ఈ రెండు ప్రశ్నలు తెలుగు ప్రజల్ని ఎప్పటి నుంచో ఊరిస్తున్నాయి.అయితే వాటికి ఇప్పటిదాకా సూటిగా సమాధానం రాలేదు గానీ …లీలామాత్రంగా సీన్ అర్ధమవుతోంది.కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడకి అండగా నిలిచేందుకు వైసీపీ నేతలు తప్ప స్వతంత్రులు కూడా ఆలోచిస్తున్న తరుణంలో డాక్టర్ మోహన్ బాబు నేరుగా కిర్లంపూడిలోని అయన ఇంటికెళ్ళారు.

ముద్రగడ మీద మోహన్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు.అయన పోరాట యోధుడని పొగడటమే గాకుండా ముద్రగడ చేస్తున్న ఉద్యమం న్యాయమైందని మోహన్ బాబు చెప్పారు.అయన పోరాటమంటే తనకు ఇష్టమని డైలాగ్ కింగ్ చెప్పుకొచ్చారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో మోహన్ బాబు చర్య అయన భావి రాజకీయ వ్యూహానికి సూచికగా కనిపించడం లేదా?

NO COMMENTS

LEAVE A REPLY