మంచు లక్ష్మిని ఫాలో అవుతున్న మోహన్ బాబు..!!

Posted January 25, 2017

mohanbabu following manchu lakshmi
వెండితెరపై తనేంటో నిరూపించుకున్న మంచు లక్ష్మీ బుల్లితెరపై కూడా దుమ్ము దులిపేస్తోంది. ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న మేము సైతం షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ హీరో హీరోయిన్లందరూ ఆ షోలో మేము సైతం అంటూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కాగా దాదాపు అందరూ సినీ వారసులు తమ తమ తండ్రుల అడుగు జాడల్లో నడుస్తుండగా మోహన్ బాబు మాత్రం తన కూతుర్ని ఫాలో అవుతున్నాడు. తనకు కూడా బుల్లితెరపై కన్పించాలని ఉందని చెప్పుకొచ్చాడు.

దాసరి నారాయణ రావు అభిషేకం’ సీరియల్ 2,500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహనబాబు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ ఆర్టిస్టులంటే తనకు ఎంతో గౌరవం, ప్రేమ అని తెలిపాడు. టీవీ షోలలో నటించాలని తానూ కూడా అనుకునేవాడినని, కానీ, ఓపిక, సమయం లేక, పని ఒత్తిడి వల్ల చేయలేకపోయానని, అయితే, మంచి స్టోరీ ఏదైనా దొరికితే టీవీ సీరియల్స్ లో తప్పక నటిస్తానని అని మోహన్ బాబు పేర్కొన్నాడు. మొత్తానికి మోహన్ బాబు.. మంచు లక్ష్మిని బాగానే ఫాలో అవుతున్నాడని, ముందు సీరియల్స్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చి తర్వాత కమర్షియల్ షోలు కూడా చేస్తాడని సినీ వర్గాలు అంటున్నాయి.

Post Your Coment
Loading...