600కోట్లతో మల్టీస్టారర్.. క్యాస్టింగ్ కూడా భారీగానే

Posted March 28, 2017 (4 weeks ago)

Mohanlal Aishwarya Rai Bachchan Amitabh Bachchan nagarjuna and Vikram in Randamoozham Malayalam Movieమల్టీస్టారర్ అంటే ఏదో ఇద్దరి ముగ్గురు హీరోలు,  ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి సినిమా తీసి మల్టీస్టారర్ అని చెప్పుకోవడం  ఇటీవల బాగా పెరిగిపోయింది.  అయితే నిజంగా మల్టీస్టారర్ అంటే ఏంటో చూపించనున్నారు మాలీవుడ్ దర్శకుడు. 

రాండామూజమ్ అనే పౌరాణిక  సినిమాను మళయాళ భాషలో  సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన నవల రాండామూజమ్ ఆధారంగా దర్శకుడు శ్రీకర్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇక క్యాస్టింగ్ విషయానికొస్తే

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాతో మరోసారి మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారని దర్శకుడు తెలిపాడు. భీష్మ పితామహుడిగా అమితాబ్ అభిమానులను అలరించనున్నాడని చెప్పాడు. ఈ చిత్రంలో మోహన్ లాల్ భీమసేనుడి పాత్రను పోషిస్తున్నారు. అలానే మన తెలుగు హీరో నాగార్జున, కోలీవుడ్ హీరో విక్రమ్ లు కూడా కీ రోల్స్ లో నటించనున్నారని చిత్రయూనిట్ తెలిపింది. ఇక మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ కూడా ఈ  సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. సినిమాలోని ఓ ముఖ్యపాత్ర కోసం దర్శకుడు ఐశ్వర్యను సంప్రదించారట. అయితే ఆమె రెమ్యూన్ రేషన్ విషయంలో కాస్త పట్టుదలగా ఉందని సమాచారం. పౌరాణిక పాత్రలకు ఎలాంటి మార్పులు చేయడం లేదని,  పురాణాల ప్రకారమే ఆ పాత్రలను తెరకెక్కిస్తున్నాం దర్శకుడు  శ్రీకర్ తెలిపారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. మరి ఇంత భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Post Your Coment
Loading...