ముద్రగడకి వైసీపీ సంకెళ్ళేస్తోందా?

Posted November 17, 2016 (4 weeks ago)

mudragada is arrested by ycp
కాపు రిజర్వేషన్ ఉద్యమ భారాన్ని నెత్తికెత్తుకున్న ముద్రగడ అడుగు బయటికి పెట్టకుండా చంద్రబాబు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది.ఇది ఈ ఒక్కసారే కాదు ..ఎన్నిసార్లు అయన అనుమతి లేకుండా బయటికి వచ్చినా ఇదే పని చేయడానికి బాబు ప్రభుత్వం రెడీ గా వుంది.ఈ ఒక్క విషయం చాలు ముద్రగడకి,అయన ఎత్తుకున్న అంశానికి బాబు సర్కార్ ఎంతలా భయపడుతుందో చెప్పడానికి.ఇలా చేయడం ద్వారా ముద్రగడ ప్రాధాన్యాన్ని బాబు పరోక్షంగా పెంచుతుంటే …ఆయనకి అండాదండా అని చెప్పుకుంటున్న వైసీపీ మాత్రం అర్ధంపర్ధం లేని వ్యూహాలతో ఆయనకి సంకెళ్ళేస్తోంది.అదెలాగో మీరే చూడండి..
తుని ఘటన మొదలుకొని కాపు ఉద్యమం అని ముద్రగడ ముందుకు రాగానే ఆయన్ను తమ మనిషిగా చెప్పుకునేందుకు వైసీపీ పడుతున్న తాపత్రయం అంతాఇంతా కాదు.దాసరి ఇంట్లో జరిగిన చర్చల్లోనూ ముద్రగడ చుట్టూ వైసీపీ నేతలే ..

అంతెందుకు తాజాగా ముద్రగడ హౌస్ అరెస్ట్ తర్వాత వైసీపీ లోని కాపు నేతలు కిర్లంపూడి వెళ్లే ప్రయత్నం చేసి అరెస్ట్ అయితే …సాక్షి దాన్ని పార్టీ నేతల దిగ్బంధంగా వార్త రాసింది.నిజానికి ముద్రగడ కాపుల కోసం ఉద్యమాన్ని జరుపుతున్నాడని ప్రచారం చేయాల్సిన వైసీపీ …ఆ ఉద్యమం ముందుకెళ్ళేదాకైనా నిగ్రహం పాటించాలి.ముందు ముద్రగడ జనాల్లోకి వెళ్ళాక పార్టీ ఆయన్ను సొంతం చేసుకోడానికి ప్రయత్నించాలి..కానీ మొత్తం ఉద్యమాన్ని తామే నడిపిస్తున్నామని చెప్పేందుకు తాపత్రయపడి ముద్రగడకి సంకెళ్ళేస్తోంది. అసలు విషయానికి తానే రాజకీయ ముద్ర వేసి టీడీపీ కి అవకాశమిస్తోంది.మొత్తంగా కులచిచ్చు రగిల్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపణలకు ఛాన్స్ ఇస్తోంది.మున్ముందు కూడా ఇలాగే ఉంటే ముద్రగడకి వైసీపీ,వైసీపీకి ముద్రగడ భారం అవుతారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

NO COMMENTS

LEAVE A REPLY