మీ అనుమతి నాకొద్దు..ముద్రగడ

0
26

Posted November 18, 2016 (3 weeks ago)

mudragada padmanabham said don't takes police permission for padayatraకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధ పర్వం ఇంకా కొనసాగుతూనే వుంది, పోలీసులు తన ఇంటి పరిసరాల నుంచి వెళ్తే తప్ప తాను పద యాత్ర తేదీల ను ప్రకటించాను అని ముద్రగడ తెగేసి చెప్తున్నారు, వాస్తవానికి పోలీసులు 48 గంటల గడువు ఇచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.అయితే కొంత సడలింపును ఇవ్వడం వాళ్ళ స్థానిక నాయకులతో ముద్రగడ కలిసి మంతనాలు జరిపారు గడువు ముగిసినా గృహనిర్బంధాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనే విషయంపై పోలీసుల నుంచి స్పష్టత రావడం లేదు. ముద్రగడ సహా కాపు నేతలను మూడో రోజు కూడా గృహ నిర్బంధంలోనే ఉంచడంతో ప్రభత్వ ఎత్తుగడ అర్ధం కావడం లేదు.ఫలానా తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని ముద్రగడ గానీ మరెవరైనా చెబితే పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఇస్తేనే పాదయాత్ర చేస్తా అని ఆ తర్వాతే పాదయాత్ర ప్రారంభిస్తా అని ముద్రగడ అంటున్నారు .కానీ పోలిసుల అనుమతి తీసుకొని పాదయాత్ర చేయనని స్పష్టం చేసారు . ఎన్ని రోజులైనా గృహ నిర్బంధం లో ఉంటేనే కానీ అనుమతి మాత్రం తీసుకోనని అన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY