ముమైత్ కి పెళ్లి వద్దు..ఆ అవసరం లేదు

 Posted March 24, 2017

mumaith khan says about her marriage
ముమైత్ ఖాన్ ….హాట్ హాట్ అందాలు,ఐటెం సాంగ్స్ తో ఓ ఐదేళ్ల పాటు కుర్రకారు మతులు పోగొట్టిన ముమైత్ ఖాన్ కొన్నేళ్లుగా వెనకబడింది.ఉన్నట్టుండి ఆమె కెరీర్ వెనక్కి వెళ్ళింది.ఎందుకిలా జరిగింది ? ఈ ప్రశ్నకి ఆమె నేరుగా సమాధానం చెప్పకపోయినా …తన జీవితంలో కీలక ఘట్టాల్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.అందులోనే ఆమె కెరీర్ కి అడ్డంకిగా నిలిచిన విషయాలు తెలిసిపోయాయి.ఇంతకీ ముమైత్ చెప్పిన ఆ సంగతులు కాస్త సంచలనం అనే అనిపిస్తున్నాయి.

ముమైత్ ఖాన్ కి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట.అందుకు కారణం ఇప్పటిదాకా ఆమెకి ఎదురైన అనుభవాలే.ముమైత్ నలుగురితో సహజీవనం చేసిందట.తొలివాడితో నాలుగేళ్లు,రెండో వాడితో మూడున్నరేళ్లు,మూడో వాడితో రెండేళ్లు,నాలుగో వాడితో ఏడాదిన్నర గడిపిందట.ప్రతి సందర్భంలోనూ ఆమెకి ఎదురు దెబ్బలు తగలడంతో ఇక మగ తోడు అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చిందట.పైగా ఈ బంధాల వల్ల ఆమె చాలా డబ్బు నష్టపోయిందట.ఆ నలుగురిలో ఒకడి కోసం తాను ఓ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే దాని ఖర్చు 27 లక్షల వరకు అయ్యిందట.ఆ సర్జరీ లో భాగంగా ఆమె మెదడులో ఖరీదైన 9 టైటానియం వైర్లు అమర్చవలసి వచ్చిందట.ఇంత చేసినా ఆ బంధం నిలవలేదు .ఇవన్నీ చూసాక ముమైత్ ఇక పెళ్లి వద్దు …ఆ అవసరం లేదు అని డిసైడ్ అయిపోయింది.

మనకు తెరపై వెలుగుజిలుగుల మధ్య కనిపించి ఇంకాస్త హీట్ పుట్టించే డ్రెస్,డాన్స్ లతో ముమైత్ జీవితంలో ఊహించని కోణం ఇది.అందుకే కనిపించే పై పూత ని మెరుపుగా భావించి ఆ ఆకర్షణలో కొట్టుకుపోకుండా ఉంటే మంచిది.

Post Your Coment
Loading...