రకుల్ ప్రీతిసింగ్ కు షాక్ ఇచ్చిన మురుగదాస్

Murugadoss Shocking Comments On Rakul Preet Singh

Posted November 12, 2016 (4 weeks ago)Murugadoss Shocking Comments On Rakul Preet Singhఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు డైరెక్టర్ మురుగ దాస్ షాక్ ఇచ్చాడు . చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాతో పాటు మురుగదాస్ మహేష్ బాబుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది.

మహేష్ సినిమా షూటింగ్ సందర్భంగా మురుగదాస్ చెప్పిన విషయం రకుల్ ను షాక్ కు గురిచేసిందట మురుగదాస్ గతంలోనే ఓ సినిమాకు రకుల్ హీరోయిన్గా తీసుకోవాలని భావించాడట. కానీ రకుల్ చేసిన ఓ టివి కమర్షియల్ చూసి తుపాకీ సినిమాకు హీరోయిన్గా తీసుకోవాలని భావించాడు. అయితే రకుల్ కాంటాక్ట్ కోసం ఆ యాడ్ ఏజెన్సీని సంప్రదించగా, ఆమెకు సినిమాల్లో చేసే ఇంట్రస్ట్ లేదని చెప్పారట ఆ ఏజెన్సీ వాళ్ళు. దీంతో తన ఆలోచనను విరమించుకొని కాజల్ను హీరోయిన్గా తీసుకున్నాడట మురుగదాస్. ఈ విషయం తెలిసిన రకుల్ ఇప్పుడు తెగ బాధపడి పోతోంది .

NO COMMENTS

LEAVE A REPLY