నాగ చైతన్య కొత్త మూవీ ప్రారంభం..

Posted February 7, 2017 (2 weeks ago)

naga chaitanya new movie starts
గతేడాది ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’తో వరుస సక్సెస్ లను సాధించిన నాగచైతన్య ఈ ఏడాది కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో, తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు. కొత్త దర్శకుడు కృష్ణ ఆర్ వీ మరిముత్తు ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న ఆ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వారాహి చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీలో చైతూ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

కాగా రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా పని చేస్తుండడం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున సరసన నటించిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు చైతూ సరసన నటించడం విశేషం. మరి తండ్రి సరసన నటించి ఆకట్టుకున్న త్రిపాఠి ఇప్పుడు కొడుకు సరసన ఎలా నటించి మెప్పించనుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY