శ్రీను వైట్ల చేతికి బావబామ్మర్దుల సినిమా?

Posted January 6, 2017

naga chaitanya srinu vaitla movie rana as producer

శ్రీను వైట్ల …ఒకప్పుడు టాలీవుడ్ లోని మోస్ట్ ప్రామిసింగ్ దర్శకుల్లో ఒకరు.అయనతో ఓ సినిమా చేస్తే చాలని టాప్ హీరోలంతా క్యూలు కట్టారు.మూడు ప్లాప్స్ తో సీన్ రివర్స్ అయ్యింది. అయన ఎక్కడ సినిమా చేయమంటాడోనని హీరోలంతా మొహం చాటేసిన రోజులున్నాయి.ఈ పరిస్థితుల్లో తనను తాను ప్రూవ్ చేసుకోడానికి ఓ అవకాశం అనుకుంటుండగా మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ ని మిస్టర్ గా ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది.ఆ సినిమా పూర్తి అవుతుండగానే ఇంకో ఛాన్స్ శ్రీను వైట్ల తలుపు తట్టింది. ఈసారి అక్కినేని కాంపౌండ్ హీరో నాగచైతన్య తో శ్రీను వైట్ల సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ టాక్.

నాగ చైతన్య హీరోగా శ్రీను వైట్ల చేయబోయే సినిమాకి నిర్మాత ఎవరో తెలుసా? చైతు బావ,మరో యంగ్ హీరో రానా అంట. వీళ్లిద్దరి కలయికలో వచ్చే సినిమాకి శ్రీను వైట్లని దర్శకుడిగా ఎంచుకోవడమే ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ . ఇంకో వైపు రానా తండ్రి సురేష్ బాబు …కృష్ణ అనే కొత్త దర్శకుడితో మేనల్లుడు చైతు హీరోగా సినిమా చేస్తున్నాడు.ఒకదాని వెంట మరోటి తండ్రీకొడుకులు నిర్మాతలుగా చైతు హీరోగా సినిమాలు రావడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY