నాగ్ మూవీలో సమంత.. వాట్  ఏ కాంబినేషన్!!

Posted February 3, 2017

nagarjuna and samantha are acting in rajugari gadi 2 movieమనం సినిమాలో సమంత.. నాగార్జునకి తల్లిగా నటించింది. అయితే రియల్ లైఫ్ లో ఆమె..నాగ్ కి కోడలు. కానీ నాగ్ మాత్రం ఆమె నా కూతురు అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే… మనం సినిమాలో కలిసి నటించిన వీళ్లిద్దరూ త్వరలోనే మరోసారి  అభిమానులకు కనువిందు చేయనున్నారు.  

హారర్ కామెడీగా వచ్చి సైలెంట్ హిట్ కొట్టిన ‘రాజు గారి గది’కి సీక్వెల్ గా వస్తున్న ‘రాజు గారి గది 2’లో నాగార్జున నటిస్తుండగా, సమంత మరో కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించింది. నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తరువాత సమంత అంగీకరించిన తొలి చిత్రం ఇదే. చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, సమంత అతి త్వరలోనే జాయినవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఇందులో సమంత పాత్ర ఏమిటి? ఎవరి సరసన నటించబోతుంది? సమంతకి నాగ్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.   

Post Your Coment
Loading...