సంక్రాంతి బరిలో సీనియర్ పుంజులు..

  nagarjuna chiranjeevi balakrishna movies sankranthi festival season
2017 సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ పుంజులు ఢీకొంటున్నాయి.తెలుగు చిత్ర సీమకి రెండు దశాబ్దాల పాటు నాలుగు స్తంభాలుగా నిలిచిన నలుగురిలో ముగ్గురు వెండితెర యుద్ధానికి సిద్ధమయ్యారు.మెగా స్టార్ చిరంజీవి,బాలయ్య,నాగ్ బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారు.అందులో చిరు,బాలయ్య ప్రతిష్టాత్మక సినిమాలతో బరిలోకి దిగుతున్నారు.చిరు 150 వ సినిమా కత్తిలాంటోడు,బాలయ్య 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి,నాగ్ ఓం నమో వెంకటేశాయ చిత్రాలతో చాలా ఏళ్ల తర్వాత ముక్కోణపు పోటీకి సై అంటున్నారు.ఈ పోటీ టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కడలేని ఆసక్తి రేపుతోంది.

మూడు సినిమాలు విడుదల తేదీలు బయటికి రాకపోయినా ఒకే వారంలో రిలీజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.బాక్సాఫీస్ కన్నా ముందే థియేటర్ ల విషయంలోనే పోటీ మొదలు కాబోతోంది.మొత్తానికి ఈ రేసులోఎవరు గెలిచినా ఓ పసందైన పోటీని చూసే అనుభూతి,అనుభవం ప్రేక్షకులకి లభిస్తుంది.

Post Your Coment
Loading...