కర్ణాటక వెళ్లిన శ్రీవారి భక్తుడు

0
68

 nagarjuna going karnataka om namo venkatesaya movie shooting purposeఅక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఓం ‘నమో వెంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఆగస్ట్ 20వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుందని టీమ్ తెలిపింది. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నాగార్జున. ఓం నమో వెంకటేశాయ కూడా ఆ స్థాయిని మరింత పెంచుతుందని అంటున్నారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY