వార్ని నాగ్ సినిమాను లేపేశారా..?

Posted November 24, 2016

Nagarjuna Namo Venkatesaya Leackedలీకుల బాగోతం ఎక్కువవుతున్న సిని పరిశ్రమలో పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమాను ఎలాంటి లీకేజ్ లు లేకుండా రిలీజ్ చేయడానికి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా బాహుబలి-2 లోని 9 నిమిషాల సీన్ లీక్ చేసిన సగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలోని కృష్ణ అనే గ్రాఫిక్స్ ఎడిటర్ ఈ లీక్ చేసినట్టు తెలిసిందే. అయితే ఈ క్రమంలో అతని దగ్గర తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కృష్ణ దగ్గర నాగార్జున నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమాకు సంబందించిన సీన్ కూడా ఉండటం చూసి అవాక్కయ్యారట.

ఆ సీన్ ను ఎవరికి షేర్ చేయలేదట.. లేదంటే శిష్యుడు రాజమౌళి సినిమా లీక్ అయిన బాట లోనే గురువు రాఘవేంద్ర రావు సినిమా లీక్ అయ్యి ఉండేది. తమ గొప్ప చూపించుకునే క్రమంలో కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాను ఇలా ముందే లీక్ చేయడం పెద్ద తప్పు. బాహుబలి దర్శక నిర్మాతలు జాగ్రత్త పడ్డారు కాబట్టి లీక్ అయిన సీన్ అంతగా ప్రభావితం చూపలేదు. ఒకవేళ కృష్ణ కనుక ఈ కేసులో దొరకకుండా ఉంటే నాగార్జున నమో వెంకటేశాయ కూడా లీక్ అయ్యి ఉండేది. ఈ విషయం తెలుసుకున్న నమో వెంకటేశాయ దర్శక నిర్మాతలు కూడా షాక్ అయ్యారట.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY