ఆ నాటి బ్యూటి … నేటి చెబ్బీ ఆంటీ..

0
37

Posted November 18, 2016 (3 weeks ago)

  namrata shirodkar sister shilpa shirodkar new getup

మాజీ మిస్‌ ఇండియా, మహేశ్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ పెద్దక్క శిల్పా శిరోద్కరే ఈ ఫొటోలో కనిపిస్తోన్న నటి శిల్పా శిరోద్కర్‌! 1989లో బ్రష్టాచార్‌ సినిమతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. కిషన్‌ కన్హయ్య, త్రినేత్ర, హమ్‌, ఖుదాగవా, ఆంఖే, పెహ్‌చాన్‌, బేవఫా సనమ్‌, మృత్యుదండ్‌ తదితర సినిమాల్లో హీరోయిన్‌ గా నటించారు. తెలుగులో మోహన్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మ’లో హీరోయిన్‌ గా నటించారు. మాధురీ దీక్షిత్‌ ప్రధాన పాత్రలో ఎంఎఫ్‌ హుస్సేన్‌ రూపొందించిన ‘గజగామిని’ శిల్పా శిరోద్కర్‌ నటించిన ఆఖరి చిత్రం.

టాలీవుడ్‌తో సైతం సంబంధాలున్న ఈ హీరోయిన్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎప్పుడో 14 ఏళ్ల కిందటే వెండితెరకు దూరమైన ఈమె.. గత మూడేళ్ల నుంచి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరైంది. గుర్తుపట్టలేనట్లు తయారైన ఈ హీరోయిన్‌ ను చూసి సహనటులే ఆశ్చర్యపోయారట..కాలం తెచ్చే మార్పు అంటే ఇదే అనుకుంట.

NO COMMENTS

LEAVE A REPLY