ఆయనతో తెర పంచుకోనంటున్న భార్య …

  namratha said no acting mahesh movie

మురుగదాస్-మహేష్ కాంబినేషన్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. న్యాయవ్యవస్థ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని.. మురుగ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని డీల్ చేస్తున్నాడని.. టాలీవుడ్ ప్రిన్స్‌కు మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అంతా చెప్పుకుంటున్నారు. దాంతో పాటే.. ఈ ‘శ్రీమంతుడు’తో ఆయన భార్య నమ్రత వెండితెరపై కనిపిస్తారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈ న్యూస్‌పై నమ్రత స్పందించారు. మహేష్‌తో నటించడంలేదని తేల్చేశారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నానని.. అలాగే భర్త కెరీర్ వ్యవహారాలు.. ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నానని చెప్పారు. వీటన్నింటితో సేవా కార్యక్రమాలకు కూడా సమయం వెచ్చిస్తున్నానని.. ఇకపై సినిమాల్లో నటించే ఆలోచన తనకు లేదని నమ్రత స్పష్టంచేశారు.

Post Your Coment
Loading...