మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మరో యంగ్ హీరో

Posted February 17, 2017

nani entrance in mollywoodప్రస్తుతం  మన తెలుగు హీరోలు చాలా మంది తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కొంతమంది హీరోలు తమ సినిమాల్ని డబ్బింగ్ మూవీస్ గా తమిళ, కన్నడ, మళయాళ  భాషల్లో విడుదల చేస్తుండగా…మరి కొంతమంది ద్విభాషా  సినిమాలు ప్లాన్  చేస్తున్నారు. తాజాగా నాని కూడా అదే రూట్లో నడుస్తున్నాడు.

గతేడాది విడుదలై సూపర్ సక్సెస్ ను అందించిన మజ్ను చిత్రం ద్వారా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా నానినే  వెల్లడించాడు.

మాలీవుడ్ నిర్మాత జి. పి సుధాకర్ ఈ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మాలీవుడ్ లో  కూడా మజ్ను పేరుతోనే విడుదల కానుంది. కాగా ఈ మూవీకి  సంబంధించిన ట్రైలర్‌ ను కూడా విడుదల చేశాడు నాని. మరి టాలీవుడ్ మజ్ను మాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY