నాని “మాస్ హీరో” అయిపోయాడుగా..!!

Posted February 13, 2017

nani next movie title mass hero

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న కుర్రహీరోల్లో నాని ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.  మజ్ను, జెంటిల్ మన్ సినిమాలతో క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తే  నేను లోకల్ మూవీతో మాస్ అభిమానులను మురిపించాడు. కాగా నాని ఇప్పుడు నిజంగానే మాస్ హీరో అయిపోయాడని సమాచారం.

ప్రస్తుతం నాని..  శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఆ  మూవీకి మాస్ హీరో అనే టైటిల్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.  మాస్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆ టైటిల్‌ కరెక్ట్‌ గా సరిపోతుందని, అలాగే మాస్ ఆడియెన్స్‌ కు కూడా వెంటనే కనెక్ట్‌ అవుతుందని అనుకుంటున్నట్లు టాక్‌. గతంలో చాలానే టైటిల్స్ అనుకున్నా.. మాస్ టైటిలైన నేను లోకల్ ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాక.. నాని కూడా ఈ టైటిల్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే డబుల్‌ హాట్రిక్‌ కొట్టి తెలుగు హీరోలందరికీ గట్టి పోటీఇస్తున్న నాని మరి మాస్ హీరోగా  ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.  

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY