ఆ నలుగురు హీరోల మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..!!

Posted February 13, 2017

nara rohit aadi sudheer babu and sandeep kishan multi starrer movie title Samanthakamaniఇటీవల కాలంలో మల్టీస్టారర్ లకు అభిమానుల్లో క్రేజ్ పెరిగిపోతుండడంతో హీరోలు కూడా వాటి వైపు  మొగ్గు చూపుతున్నారు. తాజాగా భలే మంచిరోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య ఓ మల్టీస్టారర్ ను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురు హీరోలు నటించనున్నారు.

నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుదీర్ బాబు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకి శమంతకమణి  అనే టైటిల్ ఫిక్స్  చేశారని సమాచారం. నిన్ననే పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో న‌లుగురు హీరోలున్నా.. హీరోయిన్ మాత్రం ఒక్కరేనని చిత్రయూనిట్ తెలిపింది. సినిమా కధ మొత్తం మనీ చుట్టూ తిరుగుందని వివరించింది. ఆల్రెడీ మనీ బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ స్టోరీలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటిల్లో కొన్నిహిట్టైతే మరికొన్ని ఫట్ అయ్యాయి. మరి ఈ మల్టీస్టారర్ ఏమౌనుందో చూడాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY