మోదీ మరో సరికొత్త సూచన..

0
23

Posted November 27, 2016 (2 weeks ago)

Narendra modis new idea of e-bankingపెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీ అసలు నోట్లతో పనిలేకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా దేశమంతా ముందుకెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ను అందిపుచ్చుకునే సమయం వచ్చిందంటూ ప్రధాని మోదీ సందేశమిచ్చారు.

ఆదివారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా యువతకు మంచి సమయం అని, ఈ‍ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వైపు యువత మళ్లితే బాగుంటుందని అన్నారు. డబ్బు అవసరం లేకుండా నేరుగా బ్యాంకింగ్‌ సహాయంతో అయితే అవినీతికి అవకాశం ఉండదని, లంఛాలు ఇచ్చే అవసరం ఉండదని, పారదర్శకతతో ప్రతి చర్య ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY