మతి మరుపుని మర్చిపోండి ఇలా….

Posted December 17, 2016

natural tips to avoid amnesia problemsఆమ్నెసియా అంటే మతిమరుపు కేవలం వృద్ధుల్లో మాత్రమే కాదు ఈమధ్య ఒత్తిడి కారణం గా అందరిలో ఈ ప్రాబ్లెమ్ వస్తోంది ఐతే ఏ మతిమరుపు కి కారణం నరాల బలహీనత అంటున్నారు నిపుణులు నరాలలోని జీవ కణాలు బలహీన పడితే తిరిగి కోల్పోయిన శక్తిని పుంజుకోవడం అనేది అరుదు జీవకణాలు క్రమేపి బలహీనపడుతూ జ్ఞాపకశక్తి తగ్గిపోవడమే కాకుండా మెదడు చేసే పనులన్నీ తగ్గుతూ వస్తుంటాయి.

ఈ సమస్య ఉన్న వ్యక్తులకు మాటలు జ్ఞాపకం రాకపోవడం వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు మర్చిపోవటంతో మతిమరుపు స్టార్ట్ అవుతుంది మాములుగా ఐతే వృద్ధాప్యంలో ఈ సమస్య వస్తుంది కానీ కొన్ని ప్రమాద సంఘటనలలో కూడా తాత్కాలికంగా ఈ లక్షణాలు కనపడతాయి.

ఈ మతిమరుపుకి ప్రధాన కారణం మంసాయిక వత్తిడి నరాల బలహీనత,మానసిక భ్రమలతో బాధపడేవారికి కూడా ఈ మతిమరుపు తోడవుతుంది.మతిమరుపు తగ్గించటానికి చేతికి అందుబాటులో ఉండే మూలికా చికిత్సలు కొన్నింటిని ప్రయత్నించడం మంచి మార్గం.

**ఎండబెట్టిన 5 గ్రాముల సరస్వతి ఆకులను, నీటిలో నానబెట్టి పొరతీసిన 5 బాదం గింజలను, 5 మిర్యాలను కలిపి నీటితో బాగా మెత్తగా నూరి వడకట్టి కొద్దిగా పంచదార కలిపి రెండు వారాల పాటు ఉదయాన్నే పరగడపున తింటే మతిమరుపు తగ్గుతుంది.

***ఉదయాన్నే 5 గ్రాముల శంఖపుష్పి పువ్వులతో 5 గ్రాముల పటికబెల్లం కలిపి మెత్తగా నూరి పాల తో తీసుకోవాలి.

***ప్రతి రోజు ఉదయాన్నే ఒక ఆపిల్‌ తిని టీ స్పూన్‌ తేనెను గ్లాసు పాలల్లో కలిపి తాగుతుంటే మతిమరుపు, మానసిక ఉద్రేకాలను తగ్గిస్తుంది.

**ఒక టీ స్పూన్‌ జీలకర్ర పొడిని 2 టీ స్పూన్ల తేనెతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే మతి మరుపు తగ్గిస్తుంది.

**మతిమరుపు కలవారు ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉన్న గింజలు, చిరు ధాన్యాలు, పండ్లరసాలు, ఆవుపాలు, అత్తిపళ్ళు, ద్రాక్ష, ఆరెంజ్‌, ఖర్జూరాలు మొదలైనవి వాడి ఆహారపదార్థాలలో ఉండేట్టు చూసుకోవాలి. ఎల్లా చేయడం వల్ల మతిమరపు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

Post Your Coment
Loading...