చెమట పట్టకుండా మొబైల్‌ ఫ్యాన్‌

  Posted [relativedate]
new invention mobile fan for no sweatప్రదేశంతో పనిలేకుండా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు.. అది గది కావచ్చు.. బహిరంగ ప్రదేశం కావచ్చు.. రోడ్డుపైనా అవొచ్చు… చివరకు మరుగుదొడ్లిలో కూడా చాలా మంది మొబైల్‌ ఫోన్‌ను వదలడం లేదని తాజా సర్వే సైతం తేల్చింది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా మొబైల్‌కు కనెక్ట్‌చేసుకునే ఫ్యాన్‌ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. దాన్ని మొబైల్‌ యూఎస్‌బీలోగుచ్చితే చాలు వెంటనే పనిచేస్తుంది. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టడానికి దాదాపు అన్నీ మైక్రో యూఎస్‌బీలనే వాడుతున్నారు. కొత్తగా వచ్చి ఫ్యాన్లు సైతం వీటికి అనుగుణంగానే అందిస్తున్నారు. దీనితోపాటు యాపిల్‌ ఫోన్లకు కూడా ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఇక వాడకం విషయానికొచ్చే సరికి  ఎక్కడున్నా మనకు చెమట పట్టకుండా చేయడంమే ప్రధాన లక్ష్యం… ఎలాగూ మొబైల్‌ వాడాలంటే మొహం ముందే పెట్టుకుంటాం కాబట్టి గాలి నేరుగా తగులుతుంది. అందుకే యాక్ససిరీస్‌ సంస్థలు కూడా ఇటువంటి వినూత్న పరికరాలకు రూపకల్పన చేసున్నారు. ధరకూడా బడ్జెట్‌లోనే…
new invention mobile fan for no sweatకొత్త రకం వస్తువు కాబట్టి ధర చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటే పొరపాటే.. రూ.100 నుంచి 300 ఽమధ్యలో కూడా ఈ ప్రాడెక్టు అందుబాటులో ఉంది. ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లలో ఒక క్లిక్‌ కొడితే ఇంటికొచ్చి వాలుతుంది. చాలా రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని సెట్ల రూపంలో కూడా ఆర్డర్‌ ఇవ్చొచ్చు.. అందరినీ ఆసక్తి కల్పించే ఈ చిన్న ఫ్యాన్‌ని మీరూ ప్రయత్నించండి మరి…