​హబుల్‌ కన్నా మించినదట…!

Posted [relativedate]

new invention telescope range more than hubble

  • 100 రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

పరిశోధనల ఆవిష్కరణలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకునే అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) మరో ఘనత సాధించింది. విశ్వం తొలినాళ్లలో ఏర్పడిన పాలపుంతల అన్వేషణకు రూపొందిస్తున్న శక్తిమంతమైన టెలిస్కోప్‌ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రస్తుతం నాసాకు చెందిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ 26 ఏళ్లుగా సేవలందిస్తోంది. దీని కన్నా 100 రెట్లు శక్తిమంతంగా ఉండేలా ఈ టెలిస్కోప్‌ను నాసా నిర్మించింది. దీనిని ‘జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’గా వ్యవహరిస్తున్నారు.

new invention telescope range more than hubble