నిఖిల్ మూవీ శాటిలైట్ హిట్..!

Posted [relativedate]

Nikhil EPC Satellite Rights Sold For Huge Priceయంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నిన్న రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. అలా హిట్ అయ్యిందో లేదో శాటిలైట్ రైట్స్ కోసం మూడు చానెళ్లు పోటీ పడ్డాయి. ఇక ఆ క్రమంలో మాటివి ఫైనల్ గా 3 కోట్లకు నిఖిల్ మూవీని సొంతం చేసుకుంది. మినిమం బడ్జెట్ మూవీ అయినా సరే నిఖిల్ రేంజ్ లో ఈ ఎమౌంట్ చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి. స్వామి రారా, కార్తికేయ సినిమాలతో తన పంథా మార్చుకున్న నిఖిల్ ఆ ట్రాక్ లోనే వెళ్తూ కొత్త కథలకు ప్రాణం పోస్తున్నాడు.

మొదట్లో కెరియర్ కమర్షియల్ బాట పట్టించే ప్రయత్నం చేసి ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన నిఖిల్ ఫైనల్ గా తన స్త్రెంత్ ఏంటి అని తెలుసుకున్నాడు. అందుకే హిట్ గ్యాప్ లో శంకరాభరణం అనే ఫ్లాప్ సినిమా పడ్డా మళ్లీ వెంటనే హిట్ ట్రాక్ ఎక్కేశాడు. నోట్లు రద్దయి పరిస్థితి బాలేదు అనుకున్న ఈ టైంలో నిఖిల్ సినిమా హౌజ్ ఫుల్ బోర్డ్ పడ్డది అంటే నిఖిల్ రేంజ్ సినిమా సినిమాకు పెరిగిపోతుందని చెప్పనక్కర్లేదు.