నిర్మలా కాన్వెంట్’ మూవీ రివ్యూ…

0
118

  Nirmala Convent movie review
 ఫ్యామిలి హీరోగా టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యకమైన స్ధనాన్ని సంపాదించుకున్న హీరో శ్రీకాంత్.   శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నిర్మలా కాన్వెంట్. ఇప్పటికే బాలనటిగా తెలుగు ఆడియన్స్ కు  సుపరిచితమైన శ్రియా శర్మ ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కొత్త దనానికి ఎప్పుడు ప్రాణం పోసే నాగార్జున తన ఇమేజ్ ను పక్కన పెట్టి నిర్మాలా కాన్వెంట్ లో గెస్ట్ రోల్ లో నటించాడు.ట్రైలర్ తో టీన్స్ లవ్ స్టోరి గా అనిపించిన ఈ మూవి విడుదల అయ్యాక ఏ సినిమా చూపించింది..యుత్ ఎంటర్ టైనర్ గా అని ప్రామిస్ చేసిన నిర్మాల కాన్వెంట్ ఆడియన్స్ ని ఏ మేర మెప్పించిందో ఓ సారి చూద్దం

  టీన్స్ లవ్ స్టోరి అనగానే మనకు ఠకున్న గుర్తుకు వచ్చే సినిమా కొత్త బంగారు లోకం.ఆ సినిమా తరువాత చాలా కాలానికి  మనమందుకు వచ్చిన టీన్స్ లవ్ స్టోరి నిర్మాలా కాన్వెంట్. ఫస్ట్ లుక్,టీజర్ ట్రైలర్ తో  ఫ్రేష్ ఫీల్ ని అందించింది. ఇప్పుడు సినిమాలోనూ అదే ఫిల్ కనిపించింది.కాకపోతే కధే కొంచం ఇబ్బంది పెడుతుంది.చాలా సినిమాల్లో మనం చూసిన కధే పాత సీస లో కొత్త సారా లా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ఒకే కాన్వెంట్ లో చదువుకుంటారు.ఇద్దరు ప్రేమలో పడతారు.చాలా ప్రేమ కధల్లో లాగే ఈ సినిమాలోనూ పెద్దలు.పేదరికం వీరి ప్రేమకు విలన్ లా మారుతుంది.హీరో ఆస్తీ ని కాజేసీ ఆస్తీ అంతస్తు అన్ని సంపాదిస్తేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు పిల్ల తండ్రీ.ఈ సవాల్ ను స్వీకరించిన హీరో డబ్బు సంపాదించటానికి హైదరాబాదు బయలుదేరుతాడు.హీరో డబ్బు సంపాదించాడా..?.నాగార్జున కు హీరోకు సంబంధం ఏంటీ?.చివరికి వీరి ప్రేమ ఏ కంచికి చేరింది.? ఈ ప్రశ్నలకు సమాధానమే నిర్మాలా కాన్వెంట్.

యుత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా రోషన్ తన బెస్ట్ ఫర్పామెన్స్ ఇచ్చాడు.ఎక్కడా ఇది రోషన్ ఫస్ట్ సినిమా అనిపించదు.లుక్స్ పరంగానే కాదు నటన పరంగాను ఆకట్టుకున్నాడు.బాలనటీ గా మనకు పరిచయం వున్న శ్రీయ శర్మ హీరోయిన్ గా నటించింది.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. గెస్ట్ రోల్ లో  నటించిన నాగార్జున తనదైన నటనతో సినిమాకు హైప్ తీసుకువచ్చాడు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి నాగ్ ఈ  సినిమా స్థాయిని పెంచాడు.నాగ్ లాంటి నటుడు ఈ సినిమాలో గెస్ట్ అఫీరియన్స్ తో అంచానాలు పెంచినా  కధా కధనం లో బలం లేకపోవటం తో సినిమా తేలిపోయింది.

యుత్ లవ్ స్టోరి లో యుత్ ని ఆకట్టుకునే అంశాలు లేక పోవటం. హీరో క్యారేక్టర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవటం నిరాశ పరిచే అంశం.రోటిన్ టేకింగ్ కూడ ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. నాగ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. రోషన్ సాలూరి సంగీతం బాగుంది, కొత్త కొత్త భాష పాట విజువల్ గా కూడా అలరిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ వర్క్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.ఇన్నీ వున్నా స్టార్ వారసుడిని పరిచేయం చేయటం లో తడబడ్డాడు డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి.

ట్యాగ్ లైన్ : పాత కధకు కొత్త ఫినిషింగ్
రేంటింగ్ :2.5/5

NO COMMENTS

LEAVE A REPLY