తెలుగు రాష్ట్రాల నేతలకు నో అపాయింట్ మెంట్!!

Posted December 20, 2016

no appointment to telugu leaders
తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలంటేనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కసురుకుంటున్నారట. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ తరుణంలో పార్టీ పెద్దలకు ఏమైనా చెప్పాలని కాంగ్రెస్ నేతలనుకుంటే… ఢిల్లీలో మాత్రం తెలుగు రాష్ట్రాల నాయకులకు మొండిచెయ్యే ఎదురువతోంది. ఇదంతా స్వయంకృతాపరాధం అంటున్నారు పార్టీ పెద్దలు.

ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల నేతలు కాంగ్రెస్ పెద్దలకు అరచేతిలో వైకుంఠం చూపించారట. తెలంగాణ ఇస్తే… మొత్తం ఎంపీ సీట్లు మనవేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారని సమాచారం. అదే సమయంలో ఏపీలోనూ ఇక మనకు తిరుగులేదని కొందరు సీమాంధ్ర లీడర్స్ చెప్పుకొచ్చారట. ఇదే నిజమనుకొని.. ఇక తెలుగు రాష్ట్రాల్లో మనదే హవా అని ఢిల్లీ పెద్దలు లెక్కలు కూడా వేసుకున్నారట. తీరా ఎన్నికల్లో తుస్సుమనేసరికి చిర్రెత్తుకొచ్చిందట రాహుల్ టీమ్ కు. ఇప్పటికీ ఆ షాక్ లో నుంచే తేరుకోలేకపోతున్నారట కాంగ్రెస్ పెద్దలు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అపాయింట్ మెంట్లు దొరకడం లేదట.

ఉత్తమ్, జానారెడ్డి, రఘువీరా, కేవీపీ లాంటి అతి కొద్దిమందికి తప్ప మిగతా వారెవరూ ఢిల్లీకి వచ్చినా లాభం లేదని హైకమాండ్ పెద్దలు చెబుతున్నారు. ఒక స్ట్రేచర్ ఉన్న నాయకులు తప్ప చాడీలు చెప్పే బ్యాచ్ కు అపాయింట్ మెంట్ అసలే లేదట. ఈ విషయంలో దిగ్విజయ్ సింగ్ కూడా వారిని కరుణించడం లేదని చెబుతున్నారు. అసలు అపాయింట్ మెంట్ ఇస్తేనే కదా.. పార్టీ పరిస్థితి తెలిసేది. లేకపోతే ఏం లాభం అని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారట.

Post Your Coment
Loading...