ధ్రువ బెనిఫిట్ షోలకు షాక్..!

Posted December 3, 2016

Image result for dhruva

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రాం చరణ్. ఇక స్టార్ సినిమా అంటే రిలీజ్ కు ముందు రోజే మిడ్ నైట్ షోస్ ప్రీమియర్ షోస్ పడటం మాములే కాని ధ్రువ సినిమాకు మాత్రం అలాంటివి ఏవి లేవని అంటున్నారు. ఇది ఎవరో చెబుతున్నది కాదు స్వయంగా చెర్రినే తన సినిమా బెనిఫిట్ షోస్ ఏమి వద్దనేశాడట. బ్రూస్ లీ సినిమా టైంలో నైట్ షో చూసి నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవడం వల్ల రిలీజ్ నాడు బాగా ఎఫెక్ట్ పడింది.

అందుకే డిసెంబర్ 9న ఉదయం 6 గంటల షో ఉంటుంది తప్ప మిడ్ నైట్ షోస్ మాత్రం ఉండే అవకాశం లేదట. ఇక సినిమా ఏది మొదటి షో వేస్తారో దానికే అభిమానులు మొగ్గుచూపుతారు లేండి. తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ధ్రువలో ఆ సినిమాలో విలన్ అరవింద్ స్వామే తెలుగులో కూడా నటించడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందించారు.

కొద్ది రోజులుగా స్టార్ రేసులో వెనుకపడ్డ చరణ్ సరైన హిట్ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నడు. మరి ధ్రువతో అది నెరవేరుతుందో లేదో చూడాలి. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చరణ్ హిట్ కొట్టడం ఖాయమని ట్రైలర్ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.

Post Your Coment
Loading...