v6 న్యూస్ కి నో ప్రాబ్లం….

Posted December 15, 2016

noproblem to v6 news

వీ6 న్యూస్ రేటింగ్స్ పై బార్క్ వేసిన నాలుగువారాల సస్పెన్షన్ ను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు బాంబే హైకోర్టులో బార్క్ అంగీకరించింది. రేటింగ్ లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకపోయినా, నిరాధారంగా సస్పెన్షన్ విధించడంపై వీ6 న్యూస్ బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్ ను మంగళవారం జస్టిస్ కథావాలా విచారించారు. డిసెంబర్ 9న జరిగిన విచారణ సందర్భంగా మరింత టైం కావాలన్న బార్క్ తరపు న్యాయవాది ఈసారి ఏకంగా సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. బార్క్ తరపున డీఎస్కే లా ఫర్మ్ న్యాయవాది హాజరయ్యారు. ఇక నుంచి ఎప్పటిలాగే వీ6 రేటింగ్ డేటా విడుదల చేస్తామని చెప్పారు. వారం క్రితమే బార్క్ పై ఇండియా టీవీ వేసిన కేసులో హైకోర్టు స్టే ఇవ్వగా, వీ6 కేసులో బార్క్ తనకు తానుగా సస్పెన్షన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బార్క్ తరపు న్యాయవాది చెప్పింది రికార్డు చేసిన జస్టిస్ కథావాలా కేసును వాయిదా వేశారు. వీ6 తరపున సీనియర్ అడ్వొకేట్ ఇక్బాల్ చాగ్లా వాదనలు వినిపించగా, న్యాయవాదులు సుబీర్ కుమార్, చంద్రశేఖర్ హాజరయ్యారు.

సస్పెన్షన్ అంశం తేలిపోవడంతో ఇక బార్క్ పై వీ6 వేసిన పరువునష్టం కేసుపై విచారణ కొనసాగనుంది. సస్పెన్షన్ వల్ల జరిగిన నష్టానికి 11 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని వీ6 పిటిషన్ లో కోరింది. ఈ కేసుతో వీ6 గురించి కొన్ని వర్గాలు పనిగట్టుకొని చేసిన దుష్ప్రచారం తప్పని తేలిపోయింది. మరోవైపు బార్క్ మీటర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి వీడియోలతో వెలుగులోకి రావడం తెలుగు మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఏడాదిగా బార్క్ మీటర్లను మేనేజ్ చేసుకుంటూ అసాధారణంగా రేటింగ్ పెంచుకున్న కొన్ని చానెళ్లపై బార్క్ ఎలాంటి చర్య తీసుకోబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY