ఎన్టీఆర్ ..బన్నీ మల్టీస్టారర్ నిజమేనా?

Posted November 23, 2016

ntr allu arjun multi starrer movie యంగ్ టైగర్ ఎన్టీఆర్ …స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా అనగానే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.ఇది నిజమేనా …లేక ఫిలిం నగర్ లో వినిపించే మరో పుకారో అర్ధం కావడం లేదు.పైగా ఈ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్టర్ అని కూడా వినిపించింది. ఎన్టీఆర్ ,బన్నీ మధ్య స్నేహం …ఈ ఇద్దరికీ పూరితో వున్న చనువు తెలిసిన వాళ్ళు ఇది నిజమేనేమో అనుకున్నారు.కానీ …దీని గురించి ఆరా తీసినప్పుడు తెలిసిన విషయాలివి ..

పూరి మదిలో ఓ మల్టీస్టారర్ ఆలోచన ఉన్నప్పటికీ కథ విషయంలో క్లారిటీ లేదంట.గతంలో ఎన్టీఆర్,బన్నీ తో ఈ ఆలోచన గురించి చెప్తే మంచి కథ దొరికితే చేద్దాం అన్నారట.అయితే అంతకు మించి ముందుకు వెళ్ళింది లేదు…కొత్త సినిమా ప్రయత్నాల్లో వున్న పూరి మల్టీస్టారర్ కథ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు ఓ మిత్రుడితో అన్న విషయం చివరికి ఎన్టీఆర్ …బన్నీ కాంబినేషన్ లో సినిమా దాకా ప్రచారం జరిగింది.అంతే తప్ప ఇప్పటిదాకా దీనిపై చర్చే జరగలేదంట..అదండీ సంగతి.ఇప్పుడు చెప్పండి …ఈ సినిమా పట్టాలెక్కుతుందో …లేదో?

Post Your Coment
Loading...