ఎన్టీఆర్ ఫెయిల్డ్?

 Posted March 27, 2017 (5 weeks ago)

ntr jai lava kusa movie villain getup leaked
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు ఫెయిల్ అయ్యాయేమో గానీ ఓ నటుడుగా ఆయన ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతూనే వున్నారు.టాలీవుడ్ లో ఏ ఒక్కరిని కదిలించినా ఈ మాట ఘంటాపదంగా చెప్పేస్తారు.అయితే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం మీద చేస్తున్న జై లవకుశ విషయంలో మాత్రం ఓ ఫెయిల్యూర్ చూడకతప్పలేదు.ఎన్టీఆర్ కెరీర్ లో తొలిసారిగా మూడు పాత్రల్లో మెరవబోతున్న సినిమా ఇది.అందుకే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ప్రతి విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాతే నచ్చిన కధ కోసం నెలలపాటు వెయిట్ చేసాడు.చివరకు జై లవకుశ కి ఒకే చెప్పాడు.ఎన్టీఆర్ అని అంతగా ఇంప్రెస్ చేయడంలో కధలోని జై పాత్ర.కధకి ఆయువుపట్టు లాంటి ఆ పాత్ర గెట్ అప్,డైలాగ్స్ అన్ని స్పెషల్ గా ఉండేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నారు.అంతకన్నా ముఖ్యంగా అవి సినిమా రిలీజ్ అయ్యేదాకా బయటకు రాకుండా చూడాలనుకున్నారు.ఆ విషయంలోనే ఎన్టీఆర్ ఫెయిల్ అయ్యారు.

జై పాత్ర గెట్ అప్ రహస్యాన్ని ఎన్టీఆర్,ఎన్టీఆర్ ఆర్ట్స్ బయటకు రాకుండా కాపాడగలవా అని తెలుగుబుల్లెట్ ఓ కధనం కూడా ఇచ్చింది.ఆ కధనం వచ్చిన తరువాతి రోజే జై పాత్ర కోసం హాలీవుడ్ నిపుణులు తయారు చేసిన ఎన్టీఆర్ ఫేస్ మాస్క్ బయటికి వచ్చింది.దీంతో ఎన్టీఆర్ గెట్ అప్ రహస్యం బయటికి వచ్చింది.ఆ విధంగా ఎన్టీఆర్ ఫెయిల్డ్.కానీ బయటికి వచ్చిన గెట్ అప్ చూస్తుంటే ఆ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.ఇక జై పాత్రలో ఎన్టీఆర్ జైజైలు కొట్టించుకోవడం ఖాయం అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Post Your Coment
Loading...