ఎన్టీఆర్.. ఈ కొత్త గెటప్ ఏంటి?

Posted February 15, 2017 (2 weeks ago)

ntr new getup for movieజనతాగ్యారేజ్ సక్సెస్ జోష్ ని ఐదునెలల పాటు ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ రీసెంట్ గా తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి జైలవకుశ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. తాజాగా చర్చకి వచ్చిన మరో వార్త సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాలో తారక్ మీసం లేకుండా కనిపించనున్నాడట. కెరీర్ మొదటి నుండి మీసం తిప్పడం, తొడగొట్టడం లాంటి మాస్ యాక్షన్ చేస్తూ మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న తారక్  ఫ్యాన్స్ ను అలరిస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు మీసం లేకుండా ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.

  

NO COMMENTS

LEAVE A REPLY