ఆ ఇద్దరు ఎన్టీఆర్ చేజారారు..ముగ్గురున్నారు..

Posted September 24, 2016

ntr-directors
  జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ కి ఐదారుగురు దర్శకులు కధలు చెప్పారు.ఏ దర్శకుడికి అవకాశం ఇవ్వాలి? ఏ కధకి ఓకే చెప్పాలి? ఎన్టీఆర్ ఈ ఆలోచనల్లో ఉండగానే ఇద్దరు దర్శకులు చేజారారు.బన్నీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ కి కథ వినిపించిన తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి మళ్లీ పాత గూటికే చేరుకున్నారు. చెన్నైలో బన్నీ తో తెలుగు,తమిళ్ భాషల్లో తీసే సినిమాకి శ్రీకారం చుట్టేశాడు.తనకి కథ చెప్పకపోయినా బోయపాటి దర్శకత్వంలో సినిమా గురించి ఎన్టీఆర్ ఆలోచించారు.కానీ అయన కూడా బెల్లంకొండ సురేష్ కొడుకుతో సినిమాకి రెడీ అయిపోయారు.ఆ సినిమాకి సంబంధించి కొత్త కార్యాలయం కూడా తీసుకున్నారు.పూజ చేసి మరీ అందులోకి అడుగు పెట్టారు బోయపాటి.ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎన్టీఆర్ చేజారినట్టే .

           ఇక ఎన్టీఆర్ కి కథ వినిపించి అయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ముగ్గురున్నారు.ఎన్టీఆర్ మీదే మొదటినుంచి ఆశలు పెట్టుకుని తొలి సినిమా ఆయనతోనే చేయడానికి చూస్తున్న వక్కంతం వంశీ…చిరుకి చెప్పిన ఆటో జానీ కథని కొద్దిపాటి మార్పులతో ఎన్టీఆర్ కి చెప్పిన పూరి …రామ్ తో చేయాల్సిన కథని ఎన్టీఆర్ కి చెప్పిన అనిల్ రావిపూడి …ఈ ముగ్గురు ప్రస్తుతం రేసులో వున్నారు.ఈ ముగ్గురిలో ఒకరిని ఎన్టీఆర్ ఓకే చేయొచ్చు..
       

Post Your Coment
Loading...