అన్నయ్యని అలా చూడలేదెప్పుడు ..ఎన్టీఆర్

0
103

Posted October 6, 2016

 ntr said kalyan ram ism audio

అనూప్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ల‌లో మెలోడీ ల‌ను అత్య‌ద్భుతంగా చేయ‌గ‌లిగింది అనూప్‌. జ‌గ‌న్ భ‌య్యా ఒక‌ రోజు పిలిచి క‌ల్యాణ్‌ రామ్ అన్న‌య్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది . జ‌గ‌న్‌ గారితో అన్న‌య్య ఓ సినిమా చేస్తే బావుంటుంద‌ని నాకు ఎప్ప‌టి నుంచో అనిపించేది. ఎందుకంటే టెంప‌ర్ చేయ‌క‌ ముందు నేను వేరు. అది చేసిన త‌ర్వాత నేను వేరు. నాలోకాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ టీజ‌ర్ చూశాక అది నిజ‌మ‌నిపించింది. అన్న‌య్య‌లోని వేరే ఆటిట్యూడ్ ని తెర‌పై చూపించారు పూరి భ‌య్యా. నేనెప్పుడూ అన్నయ్య లో ఈ ఆటిట్యూడ్ చూడలేదు. 

అన్న‌య్య ప‌డ్డ‌ క‌ష్టం నాకు తెలుసు. న‌టుడిగా ఆయ‌న త‌ప‌న నాకు తెలుసు. ఎందుకంటే ఆయ‌న నాకు ఫిలాస‌ఫ‌ర్‌. గైడ్‌, కొన్ని స‌మ‌యాల్లో గ‌ర్ల్ ఫ్రెండ్ కూడా. ఆయ‌న ప‌డ్డ క‌ష్టాన్ని ప్ర‌త్య‌క్షంగా చూశాను. క‌ష్టానికి ఎప్పుడూ విజ‌యం ఉంటుంది. ఆయ‌న కెరీర్‌లో ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. క‌లం బ‌లం గురించి ఇంకోసారి గుర్తు చేసే సినిమా ఇది” అని చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY