ఎన్టీఆర్ పార్టీ పెట్టేశాడా…ఇది నిజమేనా?

Posted April 16, 2017 (2 weeks ago)

ntr started his party politically
సినిమా తప్ప ఇప్పట్లో రాజకీయ ఆలోచనలు లేవని చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడే పార్టీ కూడా పెట్టేసాడా ? ఔను ఔనని సోషల్ మీడియాలో పార్టీ ధృవీకరణ పత్రం ఒకటి చక్కర్లు కొడుతోంది. అయితే తిమ్మినిబమ్మి చేసే ఈ రోజుల్లో ఆ పత్రం నిజమైనదని నమ్మడానికి వీల్లేకుండా వుంది.ఎవరో కావాలని ఇలా ప్రచారం మొదలెట్టారని డౌట్ గా వుంది.సోషల్ మీడియా లో అటు ఇటు పరుగులు తీస్తున్న ఆ పత్రం చెప్తున్న దాని ప్రకారం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పేరు నవభారత్ నేషనల్ పార్టీ.భద్రత మా లక్ష్యం..మానవతా మా నినాదం అనేది టాగ్ లైన్.

ntr started his party politically
ఎన్టీఆర్ నిజంగా ఈ పార్టీ పెట్టి ఉంటే కనుక 2019 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరగడం ఖాయం.కానీ ఇప్పుడున్న పరిస్థితులు,ఎన్టీఆర్ ఆలోచనా విధానం తెలిసిన వాళ్ళు మాత్రం ఇదేదో ఫేక్ వ్యవహారం అంటున్నారు.అది ఫేక్ కాకపోతే ఎన్టీఆర్ పార్టీ ప్రభావం గురించి ఆలోచించాలి కానీ అప్పటిదాకా పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదిది.

Post Your Coment
Loading...