దీపావళిపై ఎన్టీఆర్ ఎఫెక్ట్ ఉందా?

 Posted October 31, 2016

ntr take class to nithya menon on diwali festival
దీపావళి రోజు బాణాసంచా కాదు కాల్చాల్సింది…దీపాలు వెలిగించాలి..జనతా గ్యారేజ్ లో హీరోయిన్ నిత్యామీనన్ కి ఎన్టీఆర్ ఇలా క్లాస్ పీకడం గుర్తుందా? గుర్తుందని హైదరాబాద్ వాసులు రుజువు చేశారు .ఈసారి పర్యావరణ కాలుష్యం,చైనాలో తయారవుతున్న బాణాసంచా గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం సాగింది.దాని ప్రభావంతో ఈసారి దేశంలోని ప్రధాన నగరాల్లో బాణాసంచా హడావిడి తగ్గి దీపాల వెలుగులు పెరిగాయి .శబ్ద,వాతావరణ కాలుష్యం గతంతో పోల్చుకుంటే బాగా తగ్గింది.హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి ప్రతిబింబించింది.వర్షం కూడా మరో కారణం .వీటన్నిటి మధ్య జనతా గ్యారేజ్ ఎఫెక్ట్ కూడా కొంత ఉందని ఎన్టీఆర్ ఫాన్స్ అంటున్నారు.వారం కిందట ఓ ఛానల్ ఆ సినిమా ప్రసారం చేయడం గురించి కూడా గుర్తు చేస్తున్నారు.ఓకే మంచి ఎవరి వల్ల జరిగినా మేలే కదా ?అందులో అభ్యంతర పెట్టాల్సింది ఏముంది?

Post Your Coment
Loading...