ఆ టైం లో అమ్మ ఆత్మ ఘోషించిందా?

Posted February 16, 2017 (2 weeks ago)

o panneerselvam says about palaniswamy
బతికి ఉన్నన్నాళ్ళు తమిళ రాజకీయాల్లో జయ మేరునగ ధీరురాలు.చనిపోయినా ఆమెని తమిళ రాజకీయాలు వదిలిపెట్టడంలేదు.జయ పేరు తలచుకుంటే ఏమోగానీ ఆమె ఆత్మని పదేపదే తమ అవసరార్ధం సీన్ లోకి తెస్తున్నారు రాజకీయనేతలు.పళనిస్వామికి సీఎం పీఠం దక్కుతుందని తెలిసిన పన్నీర్ సెల్వం కూడా ఇదే భాష మాట్లాడారు.ఈ ఉదయం 11 గంటల 30 నిమిషాలకి అంటే పళనిస్వామి,గవర్నర్ విద్యాసాగరరావు భేటీ అయి వున్నారు.కొత్త ప్రభుత్వ ఏర్పాటు మీద చర్చిస్తున్నారు.పళనికి అవకాశమిస్తూ గవర్నర్ నిర్ణయం ప్రకటించారు.సరిగ్గా అదే సమయానికి అమ్మ ఆత్మ ఘోషించిందని పన్నీర్ సెల్వం అన్నారు.పళనికి సీఎం పీఠం ఖరారు అయ్యిందని తెలిశాక పన్నీర్ ఆ విధంగా స్పందించారు.అమ్మకి ద్రోహం తలపెట్టినవాళ్లకే అందలమా అని ఆయన బాధపడిపోయారు.అయితే పళనిస్వామి అమ్మకి ఏ ద్రోహం చేశారో బయటికి చెప్పలేదు.

తదుపరి ఏమి చేస్తారన్న ప్రశ్నకి పన్నీర్ సమాధానమిచ్చారు.ఈసీ ని సంప్రదించి పార్టీ ని శశికళ చేతుల్లోకి పోకుండా చూస్తామని పన్నీర్ చెప్పుకొచ్చారు.ఇన్నాళ్లు తనకి అండగా నిలబడ్డ వారికి కృతజ్ఞతలు చెప్పిన పన్నీర్ వారి అంచనాల్ని అందుకునేవిధంగా పని చేస్తానని వివరించారు.ఏమైనా అమ్మ ఆత్మ ఘోషించిందని పన్నీర్ చెప్పిన మాటలు తమిళులకు ఏ మాత్రం ఎక్కుతాయో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY