పన్నీర్ టీం అలెర్ట్…తిరుగుబాటు ఛాన్స్?

Posted February 4, 2017 (4 weeks ago)

o panneerselvam team secret meeting for chief minister seat
రేపు చెన్నైలో జరిగే అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశంలో సీఎంగా శశికళని ఎన్నుకుంటారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం అలెర్ట్ అయ్యింది. ఈ మధ్యాహ్నమే ఓ రహస్య ప్రదేశంలో పన్నీర్ కి సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు అత్యవసర సమావేశం నిర్వహించారు.ఇందులోశశికళకి దారి ఇస్తూ పదవి నుంచి వైదొలగడానికి పన్నీర్ రెడీ అయిపోయినా ఆయన అనుచరులు మాత్రం ససేమీరా అన్నట్టు తెలుస్తోంది.కేంద్రం అండ మనకే ఉంటుంది కాబట్టి ముందస్తుగా రాజీనామా లాంటి నిర్ణయాన్ని ప్రకటించొద్దని వారు పన్నీర్ ని కోరారు.అవసరమైతే పార్టీ మీద తిరుగుబాటు చేసి అయినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని కొందరు ప్రతిపాదించారు.అయితే మౌనంగా వారి మాటలు విన్న పన్నీర్ ఏ నిర్ణయం ప్రకటించలేదని తెలుస్తోంది.

మరో వైపు శశికళతో ఢీకొడితే డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు దూతల నుంచి సీఎం పన్నీర్ సెల్వం కి సంకేతాలు వచ్చాయట.ఈ పరిస్థితుల్లో రేపు,ఎల్లుండి తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

NO COMMENTS

LEAVE A REPLY