పాత నోట్లను దుబాయ్ కంపెనీ కి అమ్మేసారు….

Posted December 13, 2016

old currency sold to dubai companyదుబాయ్‌: దేశంలో రద్దు చేసిన పెద్ద నోట్లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఏం చేస్తుంది? మంటల్లో తగులబెడుతుందా, సముద్రంలో పారేస్తుందా? అని అందరీకీ సందేహాలు కలిగిన విషయం తెల్సిందే. అయితే, ఈ రద్దు చేసిన రూ.500, రూ.1000 రూపాయల నోట్లను ఏం చేయబోతున్నారో తెలిసిపోయింది. వాటిని ఫర్నీచర్‌ రీసైక్లింగ్‌ కోసం కేరళలోని కన్నూర్‌ జిల్లాలోవున్న ‘వెస్టర్న్‌ ఇండియా ప్లైవుడ్స్‌’కు విక్రయిస్తోంది.

ఈ విషయాన్ని కంపెనీ పనిమీద దుబాయ్‌కి వచ్చిన యజమాని పీకే మాయన్‌ మొహమ్మద్‌ ఇక్కడ మీడియాకు తెలియజేశారు. వెస్టర్న్‌ ఇండియా ప్లైవుడ్స్‌ కంపెనీ పాత బిల్లు కాగితాలను రీసైక్లింగ్‌ చేసి హార్డ్‌బోర్డ్, ఫైబర్‌బోర్డ్‌ పర్నీచర్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వాటిని దుబాయ్‌ గుండా యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని పాతిక దేశాలకు విక్రయిస్తోంది. తాము కాగితం రీసైక్లింగ్‌ ద్వారా చేసే పుస్తకాల సెల్ఫ్‌లు, దుస్తుల కంబోర్డులు, టేబుల్‌ డ్రాయర్లు అందంగా ఉండడమే కాకుండా నాణ్యతతో ఉంటాయని మాయన్‌ తెలిపారు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY